రాజమందిరం, రాణీమహల్ చుట్టి, కరెంట్ మోటార్ వుండే షెడ్‌ను దాటుకుని, తిరిగి పుష్కరిణి నుంచి వస్తున్నప్పుడు అతని దృష్టి ఓ దగ్గర ఆగింది. పుష్కరిణి నుంచి నీళ్ళు వెళ్ళడానికి లోతయిన కాలువ వుంది. ఎనిమిది అడుగుల లోతుంటుంది. నీళ్ళు పారీ పారీ పక్కనున్న రాళ్ళు తొలగిపోవడంతో ఓ పాత రాగిరేకు బయటపడింది. చివరి సూర్యకిరణాలు దానిమీద రిఫ్లెక్ట్ అవుతుండడంతో అతని కంటపడింది.

ఏమిటది? ఆ రాగిరేకులో ఏముంది? అది ఏ కాలం నాటిది? లేకపోతే అది మామూలు రాగిరేకేనా? ఏమిటది? ఆర్కియాలజీ చదివినవాడు కాబట్టి అన్ని ప్రశ్నలు అతనిలో ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి.

మెల్లగా రాళ్ళను ఆధారం చేసుకుని దిగాడు. రాతి పొరల మధ్య ఇరుక్కుపోవడంతో బాగా నల్లబడింది. అతను ఊహించింది కరెక్టే! చాలా పాత రాగిరేకు అది. అంతే కాకుండా రాళ్ళ మధ్య నుండి ఎంతకీ ఊడిరావడం లేదు. దానిచుట్టూ వున్న రాళ్ళను పెరికాడు. ఇప్పుడు గట్టిగా లాగితే వచ్చింది.

అతను వూహించింది నిజమే! అది పురాతనమైంది. అందులో ఏదో విషయం వుంది. చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయి. అయితే అది ఏ భాషో, లేక అవి ఒట్టి గీతలో తెలియడం లేదు. దీని కథ ఇంటికెళ్ళి చూద్దాం లెమ్మని రాగిరేకును బ్యాగ్‌లో వేసుకున్నాడు.

అతను చాలా నింపాదిగా ఇంటికి బయల్దేరాడు. అది మామూలు రాగిరేకు అనుకున్నాడు గానీ, దాని పవర్ ఏమిటో అతనా సమయంలో వూహించలేక పోయాడు. అతనికి తెలియదు గానీ ఆ రాగిరేకుతో అతని సామాన్యమయిన జీవితం కాస్తా ఓ కొత్త మలుపు తిరిగింది.

 

To Download


Comments (0)

Rated 0 out of 5 based on 0 voters
There are no comments posted here yet

Leave your comments

Posting comment as a guest. Sign up or login to your account.
Attachments (0 / 3)
Share Your Location
Type the text presented in the image below

విజ్ఞప్తి : -

To View Download Links, Please login/Register to Site.

పుస్తకాల డవున్ లోడ్ లింక్స్ చూడడానికి దయచేసి ఈ సైట్ లోకి లాగిన్ చేయండి. అకౌంట్ లేని వారు ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి