గోదావరి జీవనది.
తెలుగువారి జీవితమది.
తల్లిగోదారికి కథాకుసుమాలతో పూజచేసిన
సీతారాముడు సామాన్య కథకుడుకాదు
వాడు గోదాట్లోచేప
అంటే అనగా అనగా ఓ చేపగాడు కాడు
ఏటివాలు వెంట కొట్టుకుపోయే సదాసీదా చేపగాడు కాడు;
ఏటికెదురీదే చేవగల పొగరు మోతు 'పొలస' చేప.

గోదారి తల్లిని ఆటలతో పాటలతో అర్చించిన పగోజీ బాపు తూగోజీ రమణలకు మూడో పూజారి సీతారాముడు ఇస్తున్న తీర్థ ప్రసాదాలు ఈ గోదావరి కథలు.

ముళ్ళపూడి వెంకట రమణగారి ఆత్మకథ "కోతి-కొమ్మచ్చి" లో సీతారాముడుగా రమణగారిచే పిలిపించుకున్న బి.వి.ఎస్.రామారావు గారు రాసిన కథలు (Godavari Kathalu) ఇవి. నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేసిన రామారావు గారు తన సుదీర్ఘ ఉద్యోగకాలంలో గోదావరి పరిసరప్రాంతాలలో తనకు ఎదురైన అనుభవాలు అన్నీ కలిపి రాసిన కథలు ఇవి. గోదావరి ప్రజల మనస్తత్వం,భాసలో యాస ఈ కథలలో సహజంగా కనిపిస్తాయి. మొత్తం 11 కథల సంపుటం ఇది. పోలవరం, భద్రాచలం నుంచి గోదావరి పాయలు సముద్రంలో కలిసేవరకూ ఉన్న వివిధ ప్రాంతాలలో నదితో జీవితాన్ని పెనవేసుకున్న వారి జీవితాలను ఈ కథల్లో చిత్రీకరించారు.

గోదావరి కథలు జాబిత


1. రాగి డబ్బు
2. ఎసరు - అత్తిసరు
3. తిప్పలు
4. అది -వాడు - చేప
5. బైరాగి
6.అద్దరి - ఇద్దరి
7. ఇదం బ్రాహ్మం
8. త్రిలోక సుందరి
9. గుండెల్లో గోదావరి
10. ఆఫీసులో ఆవకాయ గోంతులో వెలక్కాయ
11. పుష్కరాల రేవులో పుల్లట్ట్లు

To Download


Comments (0)

Rated 0 out of 5 based on 0 voters
There are no comments posted here yet

Leave your comments

Posting comment as a guest. Sign up or login to your account.
Attachments (0 / 3)
Share Your Location
Type the text presented in the image below

విజ్ఞప్తి : -

To View Download Links, Please login/Register to Site.

పుస్తకాల డవున్ లోడ్ లింక్స్ చూడడానికి దయచేసి ఈ సైట్ లోకి లాగిన్ చేయండి. అకౌంట్ లేని వారు ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి

Recently Hit